సయ్యద్‌‌‌‌ ముస్తాక్‌‌‌‌ అలీ టీ20 ట్రోఫీ.. ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ షోతో ఆకట్టుకున్న హైదరాబాద్‌

 సయ్యద్‌‌‌‌ ముస్తాక్‌‌‌‌ అలీ టీ20 ట్రోఫీ.. ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ షోతో ఆకట్టుకున్న హైదరాబాద్‌

కోల్‌‌‌‌కతా: ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ షోతో ఆకట్టుకున్న హైదరాబాద్‌‌‌‌.. సయ్యద్‌‌‌‌ ముస్తాక్‌‌‌‌ అలీ టీ20 ట్రోఫీలో ఐదో విజయాన్ని అందుకుంది. చిన్న టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో తన్మయ్‌‌‌‌ అగర్వాల్‌‌‌‌ (67 నాటౌట్‌‌‌‌), ప్రజ్ఞయ్‌‌‌‌ రెడ్డి (29) చెలరేగడంతో.. శనివారం జరిగిన ఎలైట్‌‌‌‌ గ్రూప్‌‌‌‌–బి లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌ 7 వికెట్ల తేడాతో బిహార్‌‌‌‌పై గెలిచింది. 

టాస్‌‌‌‌ గెలిచిన బిహార్‌‌‌‌ 20 ఓవర్లలో 132/8 స్కోరు చేసింది. పీయూష్‌‌‌‌ సింగ్‌‌‌‌ (34), బిపిన్‌‌‌‌ సౌరభ్‌‌‌‌ (31 నాటౌట్‌‌‌‌) ఓ మాదిరిగా ఆడారు. వైభవ్‌‌‌‌ సూర్యవంశీ (11)తో సహా మిగతా వారు ఫెయిలయ్యారు. తనయ్‌‌‌‌ త్యాగరాజన్‌‌‌‌ 3, చామ మిలింద్‌‌‌‌ 2 వికెట్లు పడగొట్టారు. తర్వాత హైదరాబాద్‌‌‌‌ 12.5 ఓవర్లలో 134/3 స్కోరు చేసి నెగ్గింది. అమన్‌‌‌‌ రావు (17), నితేశ్‌‌‌‌ రెడ్డి (7) విఫలమైనా.. తన్మయ్‌‌‌‌, ప్రజ్ఞయ్‌‌‌‌ ఈజీగా గెలిపించారు. తన్మయ్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది.