బీఆర్ఎస్‪లో మిగిలేది 2బీహెచ్‫కే వైరల్‌గా టీ కాంగ్రెస్ ట్వీట్

బీఆర్ఎస్‪లో మిగిలేది 2బీహెచ్‫కే వైరల్‌గా టీ కాంగ్రెస్ ట్వీట్

హైదరాబాద్: బీఆర్ఎస్ లో పార్టీలో మిగిలేది 2 బీహెచ్ కే అంటూ టీ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. 2బీ=బాపు, బేటా, హెచ్=హరీశ్ రావు, కే= కవిత అంటూ ట్విట్టర్ వేదికగా పేర్కొంది. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీని వీడిన విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలవటం, అధికారం కోల్పోవడం తో నాయకులు కాంగ్రెస్, బీజేపీల్లో చేరుతున్నారు.  నేను గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుందని ఇటీవలే రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించగా అంతలోనే బీఆర్ఎస్ కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్, సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

వీరి బాటలోనే మరికొంత మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం పార్టీ మారబోతున్నారని, దీంతో రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారబోతున్నదని అనే ప్రచారం వేళ ఈ ట్వీట్ ఆసక్తిగా మారింది. కాగా వంద రోజులు పూర్తిగా పాలనకే టైమ్ కేటాయించామని కానీ తమ ప్రభుత్వాన్ని పడగొడతామంటూ ప్రతిరోజు బీఆర్ఎస్, బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆ కుట్రలని తిప్పి కొట్టడంలో  నా రాజకీయం చూపిస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా టీ కాంగ్రెస్ చేసిన ట్వీట్ పై ఆసక్తి నెలకొంది.

ALSO READ :- ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు