V6 News

గాయంతో ఉమేశ్ ఔట్.. నటరాజన్‌‌కు బంపర్ ఛాన్స్

గాయంతో ఉమేశ్ ఔట్.. నటరాజన్‌‌కు బంపర్ ఛాన్స్
రెండో టెస్టులో సంచలన విజయం సాధించి ఊపు మీదున్న భారత్‌‌ను ఉమేశ్ యాదవ్ గాయం ఆందోళన కలిగిస్తోంది. మూడో టెస్టులో అతడు ఆడతాడా లేదా అనే సందిగ్ధత నెలకొంది. ఎట్టకేలకు దీనికి తెరపడింది. ఎడమ కాలి పిక్క గాయంతో బాధపడుతున్న ఉమేశ్ సిరీస్ నుంచి వైదొలిగాడు. ఇది భారత్‌‌కు ఎదురుదెబ్బే. ఉమేశ్ ప్లేస్‌‌లో టీ20 సిరీస్‌‌లో దుమ్మురేపిన ఎడమ వాటం పేసర్ టి.నటరాజన్ చోటు దక్కించుకున్నాడు. చివరి రెండు టెస్టుల్లో లెఫ్టాండర్ పేసర్ జట్టు సెలెక్షన్‌‌కు అందుబాటులో ఉంటాడు. మరో ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్‌‌ను గాయపడిన మహ్మద్ షమి స్థానంలో జట్టులో చేర్చామని ఆలిండియా సెలెక్షన్ కమిటీ తెలిపింది. ఇంజ్యురీతో బాధపడుతున్న షమి, ఉమేశ్‌‌ను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసానికి పంపనున్నట్లు పేర్కొంది.