- మంత్రి శ్రీధర్ బాబును కోరిన టీసాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విద్యావిధానంలో టీసాట్ నెట్ వర్క్‌ను భాగస్వామిగా చేయాలని ఐటీ, ఇండస్ట్రీస్మినిస్టర్ శ్రీధర్ బాబును టీసాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్‌రెడ్డి కోరారు. విద్యాశాఖకు సంబంధించి ప్రాథమిక, ఉన్నత, సాంకేతిక విద్యతో పాటు యూనివర్సిటీ స్థాయిలోను డిజిటల్ కంటెంట్‌ను అందిస్తున్నామని తెలిపారు.
ఈ మేరకు బుధవారం ఆయన టీసాట్ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్సాదిక్తో పాటు మంత్రి శ్రీధర్‌బాబును కలిసి ‘కొత్త విద్యా విధానంలో టీసాట్ భాగస్వామ్యం’ పేరుతో రూపొందించిన విధివిధానాల డాక్యుమెంట్‌ను అందజేశారు. విద్యా చానెళ్ల ప్రసారాల్లో 39 వేల వీడియోలు..14 కోట్ల వ్యూస్‌తో టీసాట్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు.
భవిష్యత్‌లో విద్యావ్యవస్థ డిజిటల్‌పై ఆధారపడే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని, దానిని దృష్టిలో పెట్టుకుని టీసాట్ ప్రత్యేక ప్రణాళిక తయారు చేసిందని చెప్పారు. ఇటీవల ‘యాన్యువల్స్టూడెంట్ కాంపిటీషన్స్-2025’ పేరుతో పోటీలు నిర్వహించామని, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు స్టూడెంట్లు, టీచర్లందరిని అందులో భాగస్వాములుగా చేశామని పేర్కొన్నారు. కాబట్టి కొత్త విద్యావిధానంలో టీసాట్ను భాగస్వామిగా చేస్తే డిజిటల్ కంటెంట్ అందించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
