టీ20 వరల్డ్ కప్‌‌ షెడ్యూల్‌‌ రిలీజ్..​ జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 9న ఇండియా పాక్​ ఢీ

టీ20 వరల్డ్ కప్‌‌ షెడ్యూల్‌‌ రిలీజ్..​ జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 9న ఇండియా పాక్​ ఢీ

న్యూఢిల్లీ :  చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరోసారి ఒకే గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోటీ పడుతున్నాయి. ఈ ఏడాది అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యం ఇస్తున్న మెగా టోర్నీలో ఇండియా–పాక్ మధ్య హైఓల్టేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జూన్ 9వ తేదీన న్యూయార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరగనుంది. ఈ మేరకు టోర్నీ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఐసీసీ శుక్రవారం విడుదల చేసింది. జూన్ 1వ మొదలయ్యే టోర్నీలో తొలి పోరులో కెన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డా, యూఏఈ తలపడుతాయి. వరల్డ్ కప్‌లో ఈసారి రికార్డు స్థాయిలో 20 టీమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాలుగు గ్రూప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బరిలోకి దిగుతున్నాయి. ఇండియా,పాక్‌తో పాటు ఐర్లాండ్, కెనడా, యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–లో ఉన్నాయి.  

జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌5న తన తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా (న్యూయార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో) ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోటీ పడనుంది. పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఢీకొట్టిన తర్వాత జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 12న అమెరికాతో, జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌15 ఫ్లోరియాలో కెనడాతో తలపడనుంది.  గ్రూప్-– బిలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీబియా, స్కాట్లాండ్, ఒమ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్ బరిలో ఉండగా, గ్రూప్ –సిలో న్యూజిలాండ్, వెస్టిండీస్, అఫ్గానిస్తాన్, ఉగాండా, ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పువా న్యూ గినియా, గ్రూప్– డిలో సౌతాఫ్రికా, శ్రీ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లంక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బంగ్లాదేశ్, నెద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్లాండ్స్, నేపాల్ పోటీ పడుతున్నాయి. జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌1 నుంచి 18 వరకు గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు జరుగుతాయి. ప్రతీ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌2 నిలిచే టీమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 19 నుంచి 24 వరకు జరిగే సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌8 రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు క్వాలిఫై అవుతాయి. ఈ రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నాలుగేసి జట్లు రెండు గ్రూప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోటీ పడుతాయి. ఇందులో టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌2లో నిలిచిన నాలుగు టీమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జూన్ 26, 27వ తేదీల్లో జరిగే సెమీ ఫైనల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తలపడుతాయి.  బార్బడోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జూన్ 29వ తేదీన ఫైన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్ జరుగుతుంది. ఈ టోర్నీలో మొత్తం 55 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను  వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆరు స్టేడియాలు, అమెరికాలోని మూడు స్టేడియాల్లో నిర్వహిస్తారు.