టీ20 వరల్డ్ కప్ లో నేపాల్‌పై సౌతాఫ్రికా ఒక్క రన్ తేడాతో విజయం సాధించింది. 116 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన నేపాల్ ఒకానొక దశలో గెలిచేలా కనిపించింది. చివరి ఓవర్‌లో 8 రన్స్ చేయాల్సి ఉండగా ఆరు పరుగులే చేసింది.చివరి బంతికి గుల్సన్ జా రనౌట్ కావడంతో 114/7 స్కోరు వద్ద ఇన్నింగ్స్ ముగిసింది. నేపాల్ బ్యాట్స్ మెన్ ఆసిఫ్ షేక్ 42, అనిల్ సా 27,, కుషాల్ బ్రుతల్ 13 పరుగులతో రాణించారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. సౌతాఫ్రికా ఓపెనర్స్ రీజా హెండ్రిక్స్ 43, డీకాక్ 10, మార్కరమ్ 15,ట్రిస్టాన్ స్ట్రబ్స్27 పరుగులు చేయడంతో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది సౌతాఫ్రికా.