
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఇండియా ఆతిథ్యం ఇవ్వనున్న టీ20 వరల్డ్ కప్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరిగే అవకాశం ఉంది. ఇండియాలో ఐదు వేదికల్లో.. శ్రీలంకలో రెండు నగరాల్లో పోటీలు జరగనున్నాయి. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సభ్య దేశాల బోర్డులకు తెలియజేసింది.
అయితే, పూర్తి షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్ వేదిక కానుంది. ఒకవేళ పాకిస్తాన్ ఫైనల్ చేరుకుంటే తుది పోరు కొలంబో లోజరగనుంది. ఐసీసీ, బీసీసీఐ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ మెగా టోర్నీలో పాక్ తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే ఆడనుంది.
టోర్నీ ఫార్మాట్ 2024 టీ20 వరల్డ్ కప్ మాదిరిగానే ఉంటుంది. మొత్తం 20 జట్లను ఐదేసి చొప్పున నాలుగు గ్రూపులుగా విభజిస్తారు.