టాబ్లెట్లు వికటించి స్టూడెంట్లకు అస్వస్థత

టాబ్లెట్లు వికటించి స్టూడెంట్లకు అస్వస్థత

నిర్మల్, వెలుగు: నిర్మల్​ పట్టణంలోని రామ్ నగర్ లోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఎండీఏ టాబ్లెట్లు వికటించి దాదాపు 10 మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు.  ఫైలేరియా నివారణకు  వాడే ఎండీఏ టాబ్లెట్లను వైద్య సిబ్బంది స్టూడెంట్లకు అందించారు.  టాబ్లెట్లు వేసుకోగానే  పదిమందికి పైగా స్టూడెంట్లు కండ్లు తిరిగి పడిపోయారు. 

వీరందరినీ వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు.  సమాచారం తెలుసుకున్న  అటవీ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్ వరుణ్ రెడ్డి , డీఈవో రవీందర్ రెడ్డి తదితరులు ఆస్పత్రిలో ట్రీట్​మెంట్​ తీసుకుంటున్న స్టూడెంట్లను పరామర్శించారు.  కాగా  ప్రస్తుతం స్టూడెంట్ల పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని డాక్టర్లు చెప్పారు.