న్యూస్ ట్యాప్ పై చర్యలు తీసుకోండి

న్యూస్ ట్యాప్ పై చర్యలు తీసుకోండి
  •      పోలీసులకు కాంగ్రెస్ నేతల  ఫిర్యాదు 

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు బేగంపేట ఎయిర్ పోర్టులో భేటీ అయ్యారని వార్త పబ్లిష్ చేసిన న్యూస్ ట్యాప్ వెబ్ సైట్ పై చర్యలు తీసుకోవాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుమార్ రావు కోరారు. వార్త రాసిన రిపోర్టర్ సాయి శేఖర్​ను అరెస్టు చేయాలన్నారు. ఆదివారం ఈ అంశంపై సైఫాబాద్ పీఎస్ లో కాంగ్రెస్ నేత మెట్టు సాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీళ్లిద్దరి మీటింగ్ జరగలేదని బేగంపేట ఎయిర్ పోర్ట్ అధికారుల నుంచి వివరాలు తీసుకున్నామని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వార్తల వెనుక బీఆర్ ఎస్ నేతలు ఉన్నారనే అనుమానాలున్నాయని ఆరోపించారు.