
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితిని 46 ఏళ్ల నుంచి నుంచి 51 ఏండ్లకు పెంచాలన్న వినతిపత్రంపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గ్రూప్-1 పోస్టులకు ఫిబ్రవరి 19న జారీ నోటిఫికేషన్తో పాటు మిగిలిన వాటికి కూడా వయోపరిమితిని పెంచాలని చీఫ్ సెక్రటరీకి సూచించింది. వయోపరిమితి పెంపుదల కోరుతూ ఎ.శ్రీనివాస్ రెడ్డి వేసిన పిటిషన్‌ను బుధవారం జస్టిస్ పుల్లా కార్తీక్ విచారించారు. నాలుగు వారాల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించి పిటిషన్‌పై విచారణను ముగించారు.