కుల ధృవీకరణ పత్రం కోసం 28వేలు లంచం డిమాండ్

V6 Velugu Posted on Oct 13, 2021

  • ములకపల్లి తాహశీల్దార్ ఆఫీసు జూనియర్ అసిస్టెంట్ రవీందర్  హ్యాండెడ్ గా పట్టివేత

కొత్తగూడెం: కుల ధృవీకరణ పత్రం కోసం తాహశీల్దార్ కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ లంచం డిమాండ్ చేశారు. పెద్దమొత్తం లంచం అడిగిన ఆయన ఎట్టకేలకు 28వేలు లంచం తీసుకునేందుకు  అంగీకరించారు. బుధవారం ములకలపల్లి తహశీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ రవీందర్‌ రూ.28వేలు లంచం తీసుకుంటుడగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేస్తున్నారు. మరో బృందం ఏసీబీ అధికారులు ఆయన ఇంటిలోనూ తనిఖీ చేపట్టారు. అక్రమ ఆస్తుల వివరాలు తెలుసుకునేందుకు సోదాలు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 

Tagged ACB Raids, kothagudem district, MRO Office, , mulakapalli, thahsildar office, junior assistant Ravinder, 28000 bribe

Latest Videos

Subscribe Now

More News