V6 News

కేసీఆర్ బయటి కొస్తుండనే రైతు భరోసా ప్రకటన : ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్

కేసీఆర్ బయటి కొస్తుండనే రైతు భరోసా ప్రకటన : ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్
  •     మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్

కరీంనగర్ టౌన్, వెలుగు: కేసీఆర్ జగిత్యాల  సభతో  బయటకు వస్తుండడంతో భయపడి రైతుభరోసా నిధులు వేస్తామని ప్రభుత్వం, సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ప్రకటించారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ఆదివారం కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానుభావుడు కేసీఆర్ అని, ఆయన చరిత్రను ఎవరూ చెరపలేరన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొట్టే విధానం తప్ప, తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. 

రాష్ట్రంలో ప్రజలకు పనికొచ్చే ఏ ఒక్క ప్రాజెక్టు కట్టకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర ఏళ్లలో రూ.మూడున్నర లక్షల కోట్ల అప్పు చేసిందని ఆరోపించారు. సోమవారం జగిత్యాలలో జరిగే సమావేశానికి ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్ , లీడర్లు పాల్గొన్నారు.