
హైదరాబాద్, వెలుగు: ‘‘బయట క్లైమెట్ బాగా లేదు..నేనేం మాట్లాడ.. టీఆర్ఎస్పై ఎవరికైనా అసంతృప్తి ఉందని మీకు తెలిస్తే వెళ్లి వాళ్లనే అడగండి.. నేనేం చెప్పగలను?’’ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. టీఆర్‌ఎస్‌లో ఎలాంటి అసంతృప్తి లేదని,మీడియానే వార్తలు రాస్తున్నదని వ్యాఖ్యానించారు.శనివారం అసెంబ్లీ ఆవరణలోని తన చాంబర్ లో తలసాని మీడియాతో కాసేపు మాట్లాడారు. మైనంపల్లి హన్మంతరావుతో కొన్ని రోజుల క్రితం క్యాజువల్ గానే మాట్లాడానని తెలిపారు. మొన్న గాంధీ ఆస్పత్రికి మంత్రి ఈటల వస్తున్నా రని తెలిసే వెళ్లానని, ఆయనే లేట్ గా వచ్చారని పేర్కొన్నారు. ‘నేనుఅప్పటికే నియోజకవర్గం లోని బస్తీలు తిరుగుతున్న. అది నా నియోజకవర్గం లో భాగమే. నేను ముందు వెళ్లా.. ఈటల లేట్ గా వచ్చారు. మంత్రిగా నాకు టీడీపీలో స్వేచ్ఛ ఉండేది.. టీఆర్ ఎస్ లోనూ ఉంది.అని తెలిపారు. జీహెచ్ ఎంసీకి షెడ్యూల్ ప్రకా