V6 News

కాళేశ్వరం కేసులో.. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు : తలసాని శ్రీనివాస్

కాళేశ్వరం కేసులో.. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు : తలసాని శ్రీనివాస్
  • మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తలసాని 

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్​ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కేసీఆర్​పై ఉమ్మేస్తే తిరిగి కాంగ్రెస్ నాయకులపైనే పడిందని ఎద్దేవా చేశారు. గురువారం హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు కుంగితేనే ఎన్డీఎస్ఏ, కాళేశ్వరం కమిషన్ పేరిట విచారణ చేయించారని మండిపడ్డారు.

8బీ, 8సీ ద్వారా నోటీసులు ఇవ్వకుండా విచారణ చేశారని చెప్పారు. సుంకిశాల వాల్, పెద్దవాగు, వట్టెం మునక, ఎస్ఎల్​బీసీ కూలిపోయిన ఘటనలో ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. మేడిగడ్డ కుంగిపోతే దానిని రిపేర్ చేస్తామని ఎల్​అండ్ టీ ముందుకు వస్తే ప్రభుత్వం బెదిరించిందని ఆరోపించారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తామని కాంగ్రెస్​మేనిఫెస్టోలో పెట్టి హామీని అమలు చేయకుండా కార్మికులను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.