- గందరగోళంగా డివిజన్ల విభజన
- లోపాలు సరిదిద్దకుంటే కోర్టుకు వెళ్తాం
- సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
పద్మారావునగర్,వెలుగు: డీ-లిమిటేషన్ పేరుతో జీహెచ్ఎంసీ డివిజన్లను ఇష్టమొచ్చినట్లు విభజించారని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన క్యాంపు కార్యాలయం వద్ద బీఆర్ ఎస్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓఆర్ఆర్ లోపల ఉన్న అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లను హడావుడిగా జీహెచ్ఎంసీ లో విలీనం చేశారన్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించకుండా ఆఫీసుల్లో కూర్చొని గూగుల్ మ్యాప్ ల ఆధారంగా డివిజన్లను ఏర్పాటు చేశారని దుయ్యబట్టారు నెల రోజులు అభ్యంతరాలకు అవకాశం ఇచ్చి, తప్పులు సరిదిద్దాలని, లేదంటే కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. కార్పొరేటర్లు కొలన్ లక్ష్మి, కుర్మ హేమలత, టి.మహేశ్వరి, మాజీ కార్పొరేటర్లు నామన శేషుకుమారి పాల్గొన్నారు.
