పద్మారావునగర్, వెలుగు : ఆర్టీసీ సమ్మెకు ప్రభుత్వ నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యమే ప్రధాన కారణమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. బుధవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని ఐడీహెచ్ కాలనీలో మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, కొత్తగా ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టి వారి ఉద్యోగ భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నారని విమర్శించారు. ప్రైవేట్ వ్యక్తులను డ్రైవర్లు, కండక్టర్లుగా నియమించడం కరెక్ట్కాదన్నారు. ఆర్టీసీ డిపోలు, విలువైన ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు ఏ విధంగా ధారాదత్తం చేస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు.

