జిన్నాను పటేల్‌తో ఎట్ల పోలుస్తవ్..

జిన్నాను పటేల్‌తో ఎట్ల పోలుస్తవ్..

పాకిస్థాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నాను సమాజ్‌వాదీ పార్టీ చీఫ్​ అఖిలేశ్‌ యాదవ్ పొడుగుతూ కామెంట్ చేయడంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన ఒక సభలో మాట్లాడుతూ జిన్నాను గొప్ప స్వాతంత్ర్య పోరాట యోధుడిగా పేర్కొన్నారు. గాంధీజీ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, నెహ్రూ, జిన్నా అంతా ఒకే చోట బారిస్టర్ చదివారని, ఆ తర్వాత వీరంతా భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలకంగా వ్యవహరించారని అన్నారు. పోరాటానికి వారెన్నడూ వెనకడుగు వేయలేదని అఖిలేశ్ అన్నారు. రైతుల కోసం పోరాడినందుకే పటేల్‌కు సర్దార్ బిరుదు వచ్చిందని.. కానీ ఆయన బాటలో పయనిస్తున్నామని చెప్పుకునే బీజేపీ ఇప్పుడు రైతులను ఏడిపిస్తోందని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని పటేల్ నిషేధించారని, ఆ సిద్ధాంతాన్నే అనుసరిస్తున్న కొందరు ఓ వైపు దేశ ఐక్యత గురించి మాట్లాడుతూ, మరోవైపు కులమతాల పేరుతో దేశాన్ని విభజిస్తున్నారని పేర్కొన్నారు.

తాలిబాన్ మెంటాలిటీ..

అయితే జిన్నాను గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్‌లతో సమానంగా అఖిలేశ్ చెప్పడాన్ని బీజేపీ తప్పుబడుతోంది. అఖిలేశ్ తీరు సిగ్గుచేటని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. ‘‘నిన్న సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్.. జిన్నాను సర్దార్ పటేల్‌తో పోల్చి మాట్లాడారు. ఇది సిగ్గుచేటు. విభజనను కోరుకునే తాలిబాన్ మెంటాలిటీ ఇది. సర్దార్ పటేల్ దేశాన్ని ఏకం చేశారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ‘ఏక్తా భారత్ శ్రేష్ఠ భారత్ (ఐక్య భారత్.. ఉన్నతమైన భారత్)’ సాధన దిశగా పని చేస్తున్నాం” అని యోగి అన్నారు.

మరిన్ని వార్తల కోసం..

మోడీ సభలో పేలుళ్ల కేసు.. నలుగురికి ఉరి శిక్ష

భారత ముస్లింలకు జిన్నాతో ఏం సంబంధం?: ఒవైసీ

తుపాకీతో బెదిరించి యువతిని రేప్ చేసిన స్నేహితుడు