రెండుచోట్ల పోటీ చేస్తే తప్పేంటి?:రాహుల్కు వయనాడ్​ వాసుల మద్దతు

రెండుచోట్ల పోటీ చేస్తే తప్పేంటి?:రాహుల్కు వయనాడ్​ వాసుల మద్దతు
  • రాహుల్ కు వయనాడ్​ వాసుల మద్దతు
  • గతంలో మోదీ కూడా రెండు చోట్లా పోటీ చేశారని వెల్లడి

తిరువనంతపురం: కాంగ్రెస్ మాజీ చీఫ్, ఎంపీ రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లోనూ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. తన సిట్టింగ్​ సీటు వయనాడ్​లో మళ్లీ బరిలోకి దిగగా.. రెండో ఫేజ్​లోనే అక్కడ పోలింగ్​ పూర్తయింది. దీంతో పాటు శుక్రవారం యూపీలోని రాయ్​బరేలీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ రెండుచోట్ల పోటీ చేయడంపై వయనాడ్​ ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయంపై ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూ నిర్వహించింది.

వయనాడ్​లో పలువురు ఓటర్లను ఈ విషయంపై కదిలించగా.. ఇండియా కూటమిలో కీలక నేతగా వ్యవహరిస్తున్న రాహుల్​ గాంధీ రెండుచోట్ల పోటీ చేయడంలో తప్పేముందని పలువురు ఓటర్లు ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ, రాహుల్​ రెండుచోట్లా గెలిస్తే వయనాడ్​ సీటును ఆయన వదులుకునే అవకాశాలే ఎక్కువని చెప్పారు. అయినప్పటికీ రాహుల్ గాంధీ రెండుచోట్లా గెలవాలనే కోరుకుంటామనే అభిప్రాయం వ్యక్తం చేశారు.  కాగా, కొంతమంది మాత్రం రాహుల్ రెండుచోట్లా పోటీ చేయడం సరికాదని అన్నారు.