
జూన్ నెలలో జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2 అనే రెండు వెబ్ సిరీస్‌లతో ఆకట్టుకుంది తమన్నా. ఇవి రెండూ అడల్ట్ సిరీస్ కావడం, అందులోనూ తమన్నా బోల్డ్ సీన్స్‌లో నటించడంతో హాట్ టాపిక్‌గా నిలిచింది. ఇప్పుడు తన కొత్త సినిమా ‘జైలర్’ మూవీ ప్రమోషన్‌తోనూ తమన్నా ట్రెండింగ్‌లో ఉంటోంది. ఈ సినిమాలోని ‘నువ్వు కావాలయ్యా’ పాట, అందులో తమన్నా వేసిన హుక్ స్టెప్స్ ఎంతో పాపులర్ అయ్యాయి. ఈ మూవీ హిందీ వెర్షన్ ప్రమోషన్ బాధ్యతను తన భుజానేసుకున్న తమన్నా.
ఇటీవల ముంబైలో డాన్స్ చేసి మరీ సినిమాను ప్రమోట్ చేసింది. తాజాగా తమిళ వెర్షన్ ఆడియో రిలీజ్ ఈవెంట్‌లోనూ తమన్నా డాన్స్ పెర్ఫార్మెన్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. దీంతో ఓవైపు తమన్నాపై ప్రశంసలు కురుస్తుంటే.. మరోవైపు ఎప్పుడూ లేనంతగా గ్లామర్ షో విషయంలో ఆమె హద్దులు దాటేస్తోందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. తనకంటే వయసులో ఎంతో పెద్దవాళ్లైన సీనియర్ స్టార్స్‌తో నటించడం గురించి ఇటీవల రియాక్ట్ అయింది తమన్నా. ‘కావాలయ్యా’ హిందీ వెర్షన్ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో ఆమె మాట్లాడుతూ ‘నటీనటులకు ఏజ్ గ్యాప్‌తో సంబంధం లేదు.
వాళ్లు హీరోస్, నేను హీరోయిన్ అంతే. మన దేశంలో మాత్రమే ఇలా ఏజ్‌ను పట్టించుకుంటాం. అంతర్జాతీయ స్థాయిలో ఎవరూ పట్టించుకోరు. అరవై ఏళ్ల వయసులో టామ్ క్రూజ్ యాక్షన్ సీన్స్ చేస్తున్నారు. అలాగే నాకు అరవై ఏళ్ల వయసు వచ్చినా ఇదే జోష్‌తో డాన్స్ చేస్తా’ అని చెప్పింది.