మహాదేవ్ బెట్టింగ్ స్కాం : నటి తమన్నాకు కోర్టు సమన్లు

మహాదేవ్ బెట్టింగ్ స్కాం : నటి తమన్నాకు కోర్టు సమన్లు

మహాదేవ్ బెట్టింగ్ యాప్(Mahadev Betting App) కేసులో నటి తమన్నా భాటియా(Tamannaah bhatia)కు మహారాష్ట్ర సైబర్ సెల్(Maharashtra cyber cell) సమన్లు జారీ చేసింది. మహాదేవ్ అనుబంధ యాప్ ఐన ఫెయిర్‌ప్లే(Fair Play) యాప్ ను ప్రమోట్ చేసినందుకు గాను కోర్టు ఆమెకు సమన్లు జారీ చేసింది. గతేడాది జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను అక్రమంగా ఫెయిర్‌ప్లే యాప్ ద్వారా ప్రసారం చేశారని, ఆ స్ట్రీమింగ్ కారణంగా వయాకామ్ సంస్థకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని, అలాంటి యాప్ ను ప్రమోట్ చేసిన తమన్నాకు సమన్లు జారీ చేస్తున్నాం అని, ఏప్రిల్ 29న ఆమె విచారణకు హాజరు కావాలని కోర్టు పేర్కొంది. 

ఇక ఇదే విషయం మరో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కి కూడా నోటీసులు అందాయి. ఆయన్ని ఏప్రిల్ 23న విచారణకు హాజరుకావాల్సిందిగా కోర్టు కోరగా.. విదేశాల్లో ఉన్న కారణంగా హాజరు కాలేకపోతున్నాని, తన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడానికి తదుపరి తేదీని ఇవ్వాలని కోరారు సంజయ్ దత్.