Prabhas: ప్రభాస్ అసలైన రాజు.. తమన్న ప్రశంసలు

Prabhas: ప్రభాస్ అసలైన రాజు.. తమన్న ప్రశంసలు

డార్లింగ్ ప్రభాస్ పై మిల్క్ బ్యూటీ తమన్నా ప్రశంసలు కురిపించింది. ప్రభాస్ డబ్బు గురించి ఆలోచించే వ్యక్తి కాదని.. అసలు ఒక రాజు ఎలాం ఉంటాడో ప్రభాస్ ను చూస్తే తెలుస్తుందంటూ పొగడ్తలతో ముంచెత్తింది. తమన్నా ఓ ఇంటర్వ్యూలో  ప్రభాస్ ఆతిథ్యం గురించి ప్రస్తావించింది. ‘  ప్రభాస్ ను తన అభిమానులు ఎంతగా ఇష్టపడతారో  తనకు తెల్వదు. అతడు అంత పెద్ద స్టార్ అయినా చాలా సింపుల్ గా ఉంటాడు. ప్రభాస్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. అతను తన ఇంటికి వచ్చిన గెస్టులను ఎలా చూసుకుంటారో అందరికీ తెలుసు. ఆయన భోజనానికి పిలిస్తే కనీసం 30 రకాల వంటలు ఉంటాయి. ప్రభాస్ ఆతిథ్యం మరిచిపోలేనిది.  ప్రభాస్ డబ్బు మనిషి కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఒక రాజు ఎలా ఉంటాడో ప్రభాస్ ను చూస్తే తెలుస్తుంది’ అని తమన్నా చెప్పుకొచ్చింది.

ప్రభాస్,తమన్నా కలిసి రెబల్ సినిమాలో కలిసి నటించారు. లారెన్స్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ప్లాప్ అయ్యింది.  తర్వాత మళ్లీ వీళ్లు బాహుబలిలో కలిసి నటించారు.  తమన్న ఈ మధ్యలో యాక్టర్ విజయ్ వర్మతో రిలేషన్ లో ఉంటుందని బాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.