చాలా బాధగా ఉంటుంది.. ట్రోల్స్ పై ఎమోషనలైన తమన్ భార్య

చాలా బాధగా ఉంటుంది.. ట్రోల్స్ పై ఎమోషనలైన తమన్ భార్య

తన భర్తపై వచ్చే ట్రోలింగ్స్ పై ఎమోషనల్ అయ్యింది తమన్(Thaman) భార్య శ్రీ వర్దిని(Sri vardhini). రీసెంట్ గా వున్న ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తమన్ పై వచ్చే ట్రోల్స్ పై స్పందించింది.. "ఇంట్లో మా ఇద్దరి మధ్య ట్రోల్స్‌ గురించి చర్చ రాదు. ఆయన కూడా వాటి గురించి ఆలోచించడు. తమన్‌ ఇంటర్వ్యూలు కూడా నేనూ చూస్తాను.. కానీ ఆ ఇంటర్వ్యూ కింద వచ్చిన కామెంట్స్‌ మాత్రం చదవను. ఎందుకంటే నేను చాలా సెన్సిటివ్‌గా ఆలోచిస్తూ ఉంటాను. అందువల్ల ఆ కామెంట్స్ ను చదివితే ఒక భార్యగా నాకు బాధగానే ఉంటుంది. వాటి వల్ల మూడ్‌ ఆఫ్‌ అవుతాను కూడా. అందుకె వాటిపై మా ఇంట్లో నో కామెంట్‌స్ అని అనుకుంటాం. తమన్‌ను అభిమానించే వారందరికి థ్యాంక్స్‌' అంటూ ఎమోషనల్‌ అయింది శ్రీ వర్దిని. 

ప్రస్తుతం శ్రీ వర్దిని మాట్లాడిన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక  తెలుగులో ప్రసారమైన  'స్వరాభిషేకం' షోలో సింగర్‌గా చాలా పాపులర్‌ అయింది వర్దిని. ఆ తర్వాత ఆమె తెలుగు, తమిళంలో పలు పాటలు కూడా పాడింది.