Arya : సార్పట్ట 2 అప్‌‌‌‌‌‌‌‌డేట్ : మళ్లీ బాక్సింగ్‌‌‌‌‌‌‌‌ రింగులోకి హీరో ఆర్య

Arya : సార్పట్ట 2 అప్‌‌‌‌‌‌‌‌డేట్ : మళ్లీ బాక్సింగ్‌‌‌‌‌‌‌‌ రింగులోకి హీరో ఆర్య

ఆర్య హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సార్పట్ట పరంపర’. నాలుగేళ్ల క్రితం ఓటీటీలో విడుదలైన ఈ చిత్రానికి తెలుగు, తమిళ భాషల్లో  ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా సక్సెస్‌‌‌‌‌‌‌‌తో ఇప్పటికే సీక్వెల్‌‌‌‌‌‌‌‌ను ప్రకటించారు మేకర్స్.  అయితే తమకున్న బిజీ షెడ్యూల్ వల్ల ఇది ఆలస్యమవుతూ వచ్చింది. తాజాగా ‘సార్పట్ట 2’ గురించి అప్‌‌‌‌‌‌‌‌డేట్ అందించాడు ఆర్య.  ఈ సీక్వెల్ షూటింగ్ ఆగస్టు నుంచి మొదలుకానుందని తెలియజేశాడు. 

పా రంజిత్ ప్రస్తుతం ఓ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడని, అది పూర్తవగానే ‘సార్పట్ట పరంపర’ సీక్వెల్ స్టార్ట్ కానుందని చెప్పాడు. 1970 నేపథ్యంలో బాక్సింగ్ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో రూపొందిన ఈ చిత్రంలో ఆర్య నటించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది.  చెన్నైలోని ఓ హార్బర్‌‌‌‌‌‌‌‌లో హమాలి కూలీగా పనిచేసే సమర అలియాస్‌‌‌‌‌‌‌‌ సామ్రాజ్యం (ఆర్య) అనే యువకుడి కథ ఇది.  సామాన్యుడైన హీరో.. బాక్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎలా ఎదిగాడనేది ఆసక్తికరంగా చూపించారు. దీంతో ఈ మూవీ సీక్వెల్‌‌‌‌‌‌‌‌పైనా అంచనాలు ఏర్పడ్డాయి.