
సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూశారు. మార్చి 29న రాత్రి చాతిలో నొప్పి వచ్చిన వెంటనే ఆయన కుటుంబ సభ్యులు వెంటనే చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు.
బాలాజీ వెట్టయాడు విలయాడు, వడా చెన్నై వంటి సినిమాల్లో ఆయన కీలక పాత్రలు పోషించారు. తెలుగులో వెంకటేశ్ ఘర్షణ, ఎన్టీఆర్ సాంబ, చిరుత, టక్ జగదీష్, సాహసం శ్వాసగా సాగిపో సినిమాల్లో నటించారు. బాలాజీ మృతి పట్ల తమిళ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. డేనియల్ బాలాజీ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో మొత్తం 50 కి పైగా సినిమాలు చేశాడు. చిత్రాల్లో ఎక్కువగా విలన్ రోల్స్ చేశాడు.