తమిళ నటి సింధూ కన్నుమూత..

తమిళ నటి సింధూ కన్నుమూత..

వెండితెరపై తనదైన నటనతో అలరించిన నటి సింధూ (44) క్యాన్సర్​ తో మృతి చెందారు. కొంతకాలంగా బెస్ట్‌ క్యాన్సర్‌తో బాధపడుతోన్న ఆమె సోమవారం (ఆగస్టు 7) వేకువ జామున 2.15 గంటలకు వలసరవక్కంలోని ఆమె నివాసంలో కన్నుమూశారు. 

తమిళనాడు కిలిపక్కంలోని ఆసుపత్రిలో బ్రెస్ట్ క్యాన్సర్‌కు (రొమ్ము క్యాన్సర్‌) చికిత్స పొందుతున్న ఆమె ఆసుపత్రి ఖర్చులను భరించలేక కొంతకాలం ఇంట్లోనే చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలో సింధు సోమవారం ఉదయం చెన్నైలోని తమ ఇంట్లో చనిపోయారు. నటి సింధూ మరణం పట్ల కోలీవుడ్‌ నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

14 ఏళ్ల వ‌య‌సులోనే సింధుకు వివాహ‌మైంది. ఏడాదికే ఓ బిడ్డకు జ‌న్మనిచ్చింది. సినీ ప‌రిశ్రమ‌లో అడుగుపెట్టిన ఆమెకు ‘అంగడి తెరు’ (తెలుగులో షాపింగ్​ మాల్​) సినిమా మంచి గుర్తింపు తెచ్చింది. ప‌లు సినిమాల్లో న‌టించిన‌ప్పటికీ ఆమెకు ఆర్థిక ఇబ్బందులు త‌ప్పలేదు. 

పలు సందర్భాల్లో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తన వ్యక్తిగత జీవితం గురించి చెప్పి కన్నీరుపెట్టుకున్నారు సింధూ. 2010లో తెలుగు హీరోయిన్ అంజలి నటించిన ‘షాపింగ్‌ మాల్’ సినిమాలోనూ సింధు ఓ పాత్రలో నటించారు. ఆ తర్వాత పలు సినిమాల‍్లో ఆమె సహాయ పాత్రలు చేశారు. క్యాన్సర్ మహమ్మారి సింధూ జీవితాన్ని తలకిందులు చేసింది. మెరుగైన చికిత్స అందిఉంటే ఆమె ప్రాణాలతో ఉండేద‌ని కుటుంబ సభ్యులు క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యారు.

2020లో సింధూ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డారు. సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పని చేసిన సింధూ పెద్దగా డబ్బులు కూడబెట్టుకోలేదు. దీంతో క్యాన్సర్‌ చికిత్సకు డబ్బులేక చివరి రోజుల్లో నరకయాతన అనుభవించారు. ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకున్న నటి సింధు కొన్నిరోజుల క్రితం ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు కిలిపక్కంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. సరైన చికిత్స అందిఉంటే నటి బతికి ఉండేదని, ఆర్ధిక ఇబ్బందుల వల్లే ఆమె అకాల మరణం చెందిందని పలువురు అభిమానులు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.