బీజేపీ తెచ్చే చట్టాలకు సీఏఏ ఓ సూచిక: సీఎం స్టాలిన్

బీజేపీ తెచ్చే చట్టాలకు సీఏఏ ఓ సూచిక:  సీఎం స్టాలిన్

చెన్నై: బీజేపీ భవిష్యత్తుల్లో తీసుకొచ్చే చట్టాలకు సీఏఏ అనేది ఓ సూచిక అని తమిళనాడు సీఎం ఎంకే. స్టాలిన్ అన్నారు. ప్రతి రాష్ట్రంలోని వేర్వేరు భాషలు మాట్లాడే ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఆ పార్టీ త్వరలోనే చట్టాలను తీసుకువస్తుందని తెలిపారు. ఆదివారం స్టాలిన్ ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు.  2004 లోక్ సభ ఎన్నికలకు ముందు సర్వేలన్ని బీజేపీ గెలుస్తాయని అంచనా వేశాయని చెప్పారు. కానీ, ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా వచ్చాయని పేర్కొన్నారు. 

“యూపీఏకు అనుకూలంగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ప్రభుత్వం పదేండ్ల పాటు కొనసాగింది. 2024లోను 2004 ఫలితాలు రిపీట్ అవుతాయి’’ అని ఆయన వెల్లడించారు. ఇదే ఇంటర్వ్యూలో సీఏఏపై కూడా స్టాలిన్ మాట్లాడారు. సీఏఏ అనేది బీజేపీ విభజన రాజకీయాల్లో భాగమని వివరించారు. ప్రస్తుతం ఈ చట్టం మైనారిటీలకు వ్యతిరేకంగా కనిపిస్తుందన్నారు.