చెన్నై: తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ స్థానానికి తమిళనాడు సీఎం విజయ్ రాజీనామా చేశారు. పెరంబూర్ సీటును నిలుపుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆదివారం తిరుచిరాపల్లి తూర్పు అసెంబ్లీ నియోజకవర్గానికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.
చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ స్థానానికి విజయ్ రాజీనామా చేయడం గమనార్హం.
#WATCH | Before assuming office as the Chief Minister of Tamil Nadu, Vijay submitted his resignation letter from the post of Member of the Legislative Assembly representing the Tiruchirappalli East constituency.
— ANI (@ANI) May 10, 2026
Today at the Secretariat, Ministers KA Sengottaiyan and P… pic.twitter.com/Y7fc9ncZHl
తమిళగ వెట్రి కజగం (TVK) చీఫ్ విజయ్.. తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికలలో తిరుచిరాపల్లి ఈస్ట్, పెరంబూర్.. ఈ రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి.. రెండింటిలోనూ విజయం సాధించారు. తిరుచ్చి నుంచి 27 వేల 416 ఓట్లు, పెరంబూర్‌లో 53 వేల 715 ఓట్ల భారీ మెజారిటీతో విజయ్ ఎమ్మెల్యేగా గెలిచారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ విజయ దుందుభి మోగించిన సంగతి తెలిసిందే. మొత్తం 234 సీట్లకు గానూ 108 చోట్ల గెలుపొందింది. ఎంజీఆర్ తర్వాత సినీ నటుడు విజయ్నేతృత్వంలోని ఈ పార్టీ.. పెట్టిన రెండేండ్లలోనే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి ద్రవిడ రాజకీయాల్లోనే సరికొత్త చరిత్రను సృష్టించింది. ఎగ్జిట్‌పోల్స్‌ను తలకిందులు చేస్తూ.. ఎన్నికల విశ్లేషకులే ఆశ్చర్యపోయేలా విజయ్దళపతి ప్రభంజనం సృష్టించారు. ఆయన పోటీచేసిన రెండుచోట్ల గెలిచి..రీల్ లైఫ్హీరో నుంచి రియల్ పొలిటికల్ లైఫ్ హీరోగా మారిపోయారు.
►ALSO READ | ఏంటి విజయ్ ఈ స్పీడ్.. తమిళనాడు సీఎంగా డ్యూటీ ఎక్కిన కొన్ని గంటలకే..
ప్రజలతో ‘విజిల్’ వేయించి మెజార్టీ స్థానాలు గెలవడం ద్వారా అటు సినిమాల్లోనే కాదు.. ఇటు పాలిటిక్స్‌లోనూ బంపర్ హిట్ కొట్టారు. టీవీకే ధాటికి దశాబ్దాల సంప్రదాయ ద్రవిడ పార్టీలైన డీఎంకే, అన్నా డీఎంకే రెండో, మూడో స్థానానికి పరిమితమయ్యాయి.
సంక్షేమ పథకాలు.. సెంటిమెంట్ రాజకీయాలు తమను గెలిపిస్తాయని నమ్మిన అధికార డీఎంకే డిజాస్టర్‌ను మూటగట్టుకోగా.. కొళత్తూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీఎం స్టాలిన్ పరాజయం పాలయ్యారు. దశాబ్దాల ద్రవిడ రాజకీయాలను పక్కకు నెట్టి, నటుడు విజయ్ తొలి ఎన్నికలతోనే కింగ్‌మేకర్‌గా మారడం తమిళ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది.
