తమిళనాడు ఫార్మేషన్‌‌‌‌ డే.. జులై 18న

తమిళనాడు ఫార్మేషన్‌‌‌‌ డే.. జులై 18న
  • నవంబర్‌‌‌‌‌‌‌‌ 1న కాదు: సీఎం స్టాలిన్‌‌‌‌ వెల్లడి

చెన్నై: తమిళనాడు ఫార్మేషన్‌‌‌‌ డేను జులై 18న నిర్వహించాలని నిర్ణయించినట్టు సీఎం స్టాలిన్‌‌‌‌ వెల్లడించారు. నవంబర్‌‌‌‌‌‌‌‌ 1న నిర్వహించాలని అప్పటి అన్నాడీఎంకే సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. రాజకీయ దురుద్దేశంతోనే అన్నాడీఎంకే నేతలు ఆ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ‘‘నవంబర్‌‌‌‌‌‌‌‌ 1, 1956న మద్రాస్ స్టేట్‌‌‌‌ నుంచి ఏపీ, కర్నాటక, కేరళ విడిపోయాయి. వివిధ రాజకీయ పార్టీలు, తమిళ స్కాలర్లు, యాక్టివిస్టులు, అసోసియేషన్లు ఆ తేదీని కేవలం బార్డర్‌‌‌‌‌‌‌‌ స్ట్రగుల్‌‌‌‌గానే చెబుతున్నాయి. మాజీ సీఎం సీఎన్‌‌‌‌ అన్నాదురై చెప్పినట్టుగా, రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్న తమిళనాడు పేరు పెట్టిన జులై 18న ఫార్మేషన్ డే నిర్వహించుకుందాం. వివిధ ఆర్గనైజేషన్లు చేస్తున్న వినతులను జాగ్రత్తగా పరిశీలించి త్వరలో జీవో ఇస్తాం’’ అని స్టాలిన్ చెప్పారు. బార్డర్‌‌‌‌‌‌‌‌ స్ట్రగుల్‌‌‌‌లో పాల్గొన్న 110 మందికి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున నవంబర్‌‌‌‌‌‌‌‌ 1న అందజేస్తామని ప్రకటించారు.