చిన్నారులతో భారీ చెస్ బోర్డు..చెస్ ఒలింపియాడ్ రిహార్సల్స్

చిన్నారులతో భారీ చెస్ బోర్డు..చెస్ ఒలింపియాడ్ రిహార్సల్స్

భారత్ మొట్ట మొదటి సారిగా చెస్‌ ఒలింపియాడ్‌ మెగా టోర్నీకి ఆతిధ్యం ఇవ్వబోతుంది. ఈ టోర్నీని అట్టహాసంగా నిర్వహించేందుకు తమిళనాడు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా  ఆరంభ వేడుకులకు సంబంధించిన రిహార్సల్స్ నిర్వహిస్తోంది. ఈ రిహార్సల్స్లో భాగంగా చిన్నారులతో పెరంబూర్ ప్లే గ్రౌండ్ లో  పెద్ద చెస్ బోర్డును రీక్రియేట్ చేసింది. ఇందులో  చెస్ పావుల్లా  చిన్నారులు వేశం ధరించారు. చెస్ పావులు కదులుతున్నట్లు వారు కదలడం ఆకట్టుకుంటోంది.  దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 

టోర్నీలో 343 జట్లు ..
తమిళనాడులోని మహాబలిపురం వేదికగా జులై 28  నుంచి 44వ చెస్ ఒలింపియాడ్ పోటీలు మొదలు కానున్నాయి. ఆగస్టు 8 వరకు జరగనున్న ఈ పోటీలు జరుగుతాయి. ఇందులో మొత్తం187 దేశాల నుంచి ఓపెన్, ఉమెన్స్ విభాగాల్లో కలిపి 343 జట్లు పాల్గొంటాయి. ఓపెన్ సెక్షన్‌లో 188 టీమ్‌లు, ఉమెన్స్  కేటగిరిలో 162 జట్టు తలపడనున్నాయి.

టోర్నీకి భారీ బందోబస్తు..
ఇండియా తరపున  మొత్తం 6 టీమ్‌లకు చెందిన 30 మంది ప్లేయర్లు బరిలోకి దిగబోతున్నారు.  ఇందులో మూడు టీమ్‌లు ఓపెన్ కేటగిరిలో పోటీపడతాయి.  మరో మూడు టీమ్స్  ఉమెన్స్  కేటగిరిలో తలపడతాయి. ఒక్కో టీమ్‌లో ఐదుగురు సభ్యులు ఉండనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.  చెస్ దిగ్గజాలంతా ఈ టోర్నీలో పాల్గొంటుండటంతో తమిళనాడు ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. మొత్తం 4 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తోంది.