తమిళనాడు బీఎస్పీ చీఫ్ హత్య: జొమాటో డెలివరీ బాయ్స్గా వచ్చి చంపేశారు..సీసీఫుటేజ్ వైరల్

తమిళనాడు బీఎస్పీ చీఫ్ హత్య: జొమాటో డెలివరీ బాయ్స్గా  వచ్చి చంపేశారు..సీసీఫుటేజ్ వైరల్

తమిళనాడు బీఎస్పీ చీఫ్ ఆమ్ స్ట్రాంగ్ హత్య కేసులో పోలీసులు కీలక విషయాలు బయటపెట్టారు. ఆమ్ స్ట్రాంగ్ హత్య కేసులో అసలైన నిందితులు అరెస్ట్ కాలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న క్రమంలో ఆమ్ స్ట్రాంగ్ హత్యకు సంబంధించిన సీసీఫుటేజ్ ని విడుదల చేశారు. జూలై 5న హంతకులు జొమాటో బాయ్స్ గా వచ్చి ఆమ్ స్ట్రాంగ్ ను దారుణంగా హత్య చేశారు. బైక్ పై స్పాట్ కు చేరుకున్న నిందితులు స్థానికులు, భవన నిర్మాణ కార్మికులు చూస్తుండగానే  దాడి చేశారు. ఆమ్ స్ట్రాంగ్ పరుగెత్తుతుండగా..వెంటపడి మరీ నరికిన దృశ్యాలు వీడియోలో కనిపించాయి. స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా  మరణాయుధాలతో బెదిరించి పారిపో యారు. 

ఆమ్ స్ట్రాంగ్ హత్య కేసులు 11 మంది నిందితులు ఉండగా.. వారిలో కీలక నిందితుడు తిరువేంగడమ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసు కాల్పుల్లో తిరు వేంగడం మృతి చెందాడు. హత్యకు ఉపయోగించిన ఆయుధాల రికవరీకోసం ఓ చెరువువద్దకు తీసుకెళ్లగా..పోలీసులపై దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించగా.. మాధవరం సమీపంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో తిరువేంగడం మరణించాడు. ఈ ఘటనలో ఓ పోలీసు గాయపడ్డాడు. అయితే ప్రతిపక్ష నేతలు నిందితుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తిరువేంగడం మృతిపై విచారణ జరిపించాలని కోరుతున్నారు.