పాఠశాలలను ప్రారంభించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న తమినాడు

పాఠశాలలను ప్రారంభించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న తమినాడు

తమిళనాడు ప్రభుత్వం ఈనెల 16 నుంచి తొమ్మిదో తరగతి… ఆపై క్లాసులకు సంబంధించిన విద్యార్థులకు పాఠశాలలను ప్రారంభించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. విద్యార్థులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. పాఠశాలలను ప్రారంభించాలని కొందరు తల్లిదండ్రులు చెప్పినప్పటికీ… ఎక్కువ మంది కరోనా భయంతో స్కూళ్లను ఓపెన్ చేయవద్దని కోరినట్లు తెలిపింది. రాసర్స్ స్కాలర్లు, ఫైనలియర్ పీజీ విద్యార్థులకు డిసెంబర్ 2 నుంచి కాలేజీలు, యూనివర్శిటీలను ప్రారంభిస్తామని చెప్పింది.

ఇప్పటి వరకు తమిళనాడుతో 7.5 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. 11,415 మంది చనిపోయారు. ఇండియాలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల లిస్టులో తమిళనాడు ఉంది.