హీరో ధనుష్కు రెడ్ కార్డ్? త్వరలో సినిమాలు బ్యాన్

హీరో ధనుష్కు రెడ్ కార్డ్? త్వరలో సినిమాలు బ్యాన్

స్టార్ హీరో ధనుష్(Danush) కు తమిళ చిత్ర నిర్మాతల మండలి షాకివ్వనుంది. గతంలో ఒక నిర్మాణ సంస్థలో సినిమా చేస్తానని అడ్వాన్స్ తీసుకొని చాలా కాలంగా చేయడంలేదట ధనుష్. దాంతో ఆ నిర్మాణ సంస్థ తమిళ చిత్ర నిర్మాతల మండలిని ఆశ్రయించింది. ఇందులో భాగంగా నిర్మాతల మండలి హీరో ధనుష్ కు రెడ్ కార్డ్(Red card) ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చిందని సమాచారం. 

ఒక వేల నిజంగా నిర్మాతల మండలి ధనుష్ కు రెడ్ కార్డ్ ఇస్తే.. ఆయన సినిమాలపై నిషేధం పడే అవకాశం ఉంది. గతంలో డైరెక్టర్ శంకర్, కమెడియన్ వడివేలు విషయంలో ఇదే జరిగింది. దాంతో వడివేలు చాలా ఏళ్ళు సినిమాలకు దూరం కావాల్సి వచ్చింది. ఇప్పుడు ధనుష్ కు కూడా అదే పరిస్థితి వస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఇంకా ఈ లిస్టులో తమిళ ఇండస్ట్రీ నుండి చాలా మంది హీరోలే ఉన్నారని సమాచారం. అందులో హీరో శింబు(Shimbu), విశాల్(Vishal), కమెడియన్ యోగిబాబు(Yogi babu) ఇలా చాలా మంది పేర్లే వినిపిస్తిన్నాయి. వీళ్ళందరకీ కూడా ఇలాగే రెడ్ కార్డు ఇవ్వాలనే ఆలోచనలో ఉందట తమిళ నిర్మాతల మండలి. మరి నిజంగా ఈ హీరోలందకీ రెడ్ కార్డ్స్ ఇస్తే.. వారి ఫ్యూచర్ ఇబ్బందుల్లో పడినట్టే అనే కామెంట్స్ వినిపిస్తన్నాయి.