- చైర్మన్‌గా నిర్మాత, డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ
హైదరాబాద్, వెలుగు: ప్రతిష్టాత్మక ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ - 2026’ జ్యూరీ కమిటీలో ప్రభు త్వం మార్పులు చేసింది. స్పెషల్ అవార్డ్స్ జ్యూరీ కమిటీ చైర్మన్‌గా ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
ఈ మేరకు గురువారం సమాచార శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రియాంక జీవో విడుదల చేశారు. గతంలో ఈ కమిటీ చైర్మ న్‌గా సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు ఉండగా, తాజా సవరణతో ఆయన స్థానంలో తమ్మారెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నెల 4న ఇచ్చిన జీవోలో సవరణ చేశారు.
