
హైదరాబాద్, వెలుగు : కేంద్రంలోని బీజేపీ సర్కారు కులగణను వ్యతిరేకిస్తూ, తెలంగాణలో బీసీని సీఎం చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించడం ప్రజలను మోసం చేయడమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో తెలిపారు.
బీజేపీ సర్కారు 2021లో జరపాల్సిన జనాభా లెక్కల సేకరణను వాయిదా వేసిందని గుర్తుచేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులపైన, మహిళలపైన దాడులు జరగని రోజంటూ లేదని పేర్కొన్నారు.
దేశంలో పెద్దఎత్తున పేదలు ఆకలితో ఇబ్బందులు ఎదుర్కంటుండగా, వారి సమస్యకు సమూల పరిష్కారం చూపడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. తెలంగాణలో కొమరం భీం ఇచ్చిన ‘జల్ జంగల్ జమీన్’ నినాదాన్ని అమలు చేస్తామని మోడీ సభలో జనసేన నేత పవన్ కళ్యాణ్ ప్రకటించడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు.