విదేశీ వైద్యులతో తారకరత్నకు చికిత్స

 విదేశీ వైద్యులతో తారకరత్నకు చికిత్స

ఇటీవల గుండెపోటుకు గురైన ప్రముఖ సినీ నటుడు నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స జరుగుతోంది. జనవరి 28న ఆయనను కుప్పం నుంచి ఇక్కడికి తీసుకువచ్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విదేశీ వైద్యులను రప్పించి చికిత్స చేయిస్తున్నట్లు ఆయన కుటుంబసభ్యుడు రామకృష్ణ వెల్లడించారు. హృద్రోగంతో పాటు, నాడీ (న్యూరో) సమస్యలకు ఆ వైద్యులు చికిత్స చేస్తున్నారు.