
హైదరాబాద్‌లోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(టీఐఎస్ఎస్) అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఈ పోస్టులను కాంట్రాక్ట్ బేస్‌పై నియమించనున్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 10.
పోస్టు: అసిస్టెంట్ ప్రొఫెసర్.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో పీజీ, నెట్/ సెట్ లేదా పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
లాస్ట్ డేట్: ఆగస్టు 10.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.1000.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు tiss.ac.in వెబ్సైట్లో సంప్రదించగలరు.