గుజరాత్లోని ఫోర్డ్ ప్లాంట్ ను కొన్న టాటా మోటార్స్

గుజరాత్లోని ఫోర్డ్ ప్లాంట్ ను కొన్న టాటా మోటార్స్

గుజరాత్లోని సనంద్లో ఉన్న ఫోర్డ్ ఇండియా కంపెనీ కార్ల తయారీ ప్లాంట్ ను టాటా మోటార్స్ రూ.725 కోట్లకు కొనుగోలు చేసింది. దీనికి సంబంధించి టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఫోర్డ్ ఇండియా కంపెనీల మధ్య యూనిట్ ట్రాన్స్ ఫర్ అగ్రిమెంట్ జరిగింది.  ఇందులో భాగంగా ఈ ప్లాంట్ లో పనిచేస్తున్న ఉద్యోగులందరు కూడా టాటా మోటార్స్ కు బదిలీ అవుతారు. ఫోర్డ్ కార్ల ప్లాంట్ అందుబాటులోకి వస్తే.. తమ కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి సామర్థ్యం మరింత పెరుగుతుందని టాటా మోటార్స్ చెబుతోంది.

ఏటా అదనంగా మరో 3 లక్షల కార్లను ఉత్పత్తి చేయడానికి ఈ ప్లాంట్ దోహదం చేస్తుందని అంటోంది. విడతలవారీగా దీన్ని 4.20 లక్షల యూనిట్లకు పెంచుతామని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. గుజరాత్ లోని సనంద్ లోనే ఇప్పటికే టాటా మోటార్స్ కు ఒక కార్ల తయారీ ప్లాంట్ ఉంది. దానికి సమీపంలోనే ఉన్న ఫోర్డ్ ఇండియా కార్ల ప్లాంట్ ను కైవసం చేసుకోవడం టాటా మోటార్స్ కు సానుకూల అంశంగా పరిణమిస్తుందని పరిశీలకులు చెబుతున్నారు.