న్యూఢిల్లీ: టాటా స్టీల్ ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన క్వార్టర్ (క్యూ4) లో రూ.2,926 కోట్ల నికర లాభాన్ని సాధించింది. ఇది గతేడాది క్యూ4లో వచ్చిన రూ.1,301 కోట్లతో పోలిస్తే 125 శాతం ఎక్కువ. కానీ, కంపెనీ లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ (ఎల్‌ఎస్‌ఈజీ) అంచనా వేసిన రూ.3,080 కోట్ల మార్క్‌ను అందుకోలేకపోయింది.
టాటా స్టీల్ ఆదాయం 13 శాతం పెరిగి రూ.63,270 కోట్లకు చేరింది. గతేడాది మార్చి క్వార్టర్‌లో రూ.56,218 కోట్ల ఆదాయం సాధించింది. తన వాటాదారులకు ప్రతి షేరుపై రూ.4 చొప్పున డివిడెండ్ అందజేస్తున్నట్లు ప్రకటించింది.
ఇందుకోసం ఈ ఏడాది జులై 6 ను రికార్డు తేదీగా నిర్ణయించింది. టాటా స్టీల్ షేరు శుక్రవారం 2 శాతం నష్టపోయి రూ.217 దగ్గర ముగిసింది.
