టాటా బ్లాక్ బస్టర్ : రూ.500 షేరు.. 4 గంటల్లో రూ.14 వందలు

టాటా బ్లాక్ బస్టర్ : రూ.500 షేరు.. 4 గంటల్లో రూ.14 వందలు

టాటా.. దీని బ్రాండ్ విలువ.. మార్కెట్ నిపుణుల కంటే జనానికి బాగా తెలిసినట్లు ఉంది. 20 ఏళ్ల తర్వాత టాటా గ్రూప్ నుంచి టాటా టెక్నాలజీస్ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యింది. ఫస్ట్ డే.. స్టాక్ మార్కెట్ లోకి అలా రిలీజ్ అయ్యిందో లేదో.. కలలో కూడా ఊహించని విధంగా షేర్ల ధర పరిగెత్తింది. 500 రూపాయల దగ్గర మార్కెట్లో ఎంట్రీ ఇవ్వగా.. మార్కెట్ ముగిసే సమయానికి 13 వందల  13 రూపాయల దగ్గర స్టాండ్ అయ్యింది. 

500 రూపాయల షేరు.. ఒక్క రోజులోనే 13 వందల రూపాయలకు చేరింది. 162 శాతం లాభం చూశారు షేర్ హోల్డర్లు. ఐపీవో బిడ్డింగ్ సమయంలోనే టాటా టెక్నాలజీస్ 69 శాతం ఓవర్ సబ్ స్ట్రయిబ్ అయ్యింది. స్టాక్ మార్కెట్ లోని మిగతా అన్ని ఐపీవోల్లోనే ఇది ఒకటిగా నిలిచింది. బిల్డింగ్ స్టేజ్ లోనే ఇంత పెద్ద రెస్పాన్స్ రావటం ఒకటి అయితే.. స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ లో వచ్చిన వెంటనే.. 168 శాతం.. అది కూడా ఒక్క రోజు ట్రేడింగ్ లోనే కావటం.. మార్కెట్ వర్గాలను షాక్ కు గురి చేసింది. ఓ దశలో 15 వందల రూపాయల వరకు వెళుతుందని అంచనా వేసినా.. 14 వందల రూపాయల దగ్గర ఫస్ట్ డే ట్రేడింగ్ లో పీక్ స్టేజ్ ను టచ్ చేయటం విశేషం. 

స్టాక్ మార్కెట్ లోకి 12 గంటలకు.. ఒక్కో షేరు 500 రూపాయలకు కంపెనీ కేటాయించగా.. అది స్టాక్ మార్కెట్ లో ఏకంగా 12 వందల రూపాయల దగ్గర ఎంట్రీ ఇచ్చింది.. మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి 13 వందల రూపాయల దగ్గర క్లోజ్ అయ్యింది. జస్ట్ నాలుగు అంటే నాలుగు గంటల్లోనే.. 500 రూపాయల షేరు 13 వందలు అంటే.. అక్షరాల 800 రూపాయలు లాభం చూశారు ఇన్వెస్టర్లు. అయితే బిల్డింగ్ లోనే ఊహించని డిమాండ్ ఏర్పడటంతో.. చాలా మంది షేర్లు ఎలాట్ కాలేదు.. షేర్లు దక్కించుకున్న వారు పండగ చేసుకుంటున్నారు. జస్ట్ 12 వేల 500 పెట్టుబడికి.. 20 వేల రూపాయల లాభం వచ్చిందంటే.. టాటా టెక్నాలజీస్ పై ఎంత నమ్మకం ఉందో అర్థం అవుతుంది..