త్వరలో మార్కెట్లోకి టాటాల ‘సూపర్ యాప్’

త్వరలో మార్కెట్లోకి టాటాల ‘సూపర్ యాప్’

డిసెంబర్‌‌‌‌లో టాటాల కొత్త డిజిటల్ ప్లాట్‌‌ఫామ్‌‌ లాంఛ్

ఇన్వెస్ట్‌‌మెంట్‌‌కు సిద్ధమైన వాల్‌‌మార్ట్

25 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి

పలువురు ఇన్వెస్టర్లతో టాటాలు చర్చలు

రిటైల్ వ్యాపారాలు మోడ్రనైజ్

బెంగళూరు: వాల్‌‌మార్ట్, టాటా గ్రూప్ జతకట్టబోతున్నాయి. సాల్ట్ నుంచి సాఫ్ట్‌‌వేర్ వరకు వ్యాపారాలున్న టాటా గ్రూప్ త్వరలోనే ఒక సరికొత్త డిజిటల్ ప్లాట్‌‌ఫామ్ ‘సూపర్ యాప్’ను లాంఛ్ చేయబోతుంది. ఈ సూపర్ యాప్‌‌లో 25 బిలియన్ డాలర్ల(రూ.1,84,509 కోట్లు) వరకు ఇన్వెస్ట్ చేసేందుకు వాల్‌‌మార్ట్ చూస్తోందని సంబంధిత వ్యక్తులు చెప్పారు. ఈ ఇన్వెస్ట్‌‌మెంట్ గురించి ఇరు కంపెనీల మధ్య చర్చలు సాగుతున్నాయని పేర్కొన్నారు. ‘సూపర్ యాప్’ను టాటా గ్రూప్, వాల్‌‌మార్ట్ జాయింట్ వెంచర్‌‌‌‌గా లాంఛ్ చేయాలని చూస్తున్నారు. టాటా గ్రూప్‌‌లోని వివిధ వ్యాపారాలు ఈ సూపర్ యాప్ ద్వారా మార్కెట్‌‌లోకి తేవాలని ఆలోచిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌‌‌‌లో లేదా వచ్చే జనవరిలోనైనా లాంఛ్ చేయాలని టాటాలు ప్లాన్ చేస్తున్నారు. ఈ యాప్ ద్వారా టాటాలు తమ ఈ–కామర్స్ వ్యాపారాలను, వాల్‌‌మార్ట్ ఈ–కామర్స్ యూనిట్ ఫ్లిప్‌‌కార్ట్ బిజినెస్‌‌లను పెంచనున్నట్టు మింట్ రిపోర్ట్ చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తన డిజిటల్ బిజినెస్ జియో ప్లాట్‌‌ఫామ్స్‌‌లో వాటాలను విక్రయించిన తర్వాత ఈ రిపోర్ట్‌‌లు వచ్చాయి. రిలయన్స్ ఈ ఏడాది జియో ప్లాట్‌‌ఫామ్స్‌‌లో వాటాలను ఫేస్‌‌బుక్, గూగుల్, కేకేఆర్, సిల్వర్ లేక్ పార్టనర్స్ వంటి ఇన్వెస్టర్లకు అమ్మిన విషయం తెలిసిందే. వాటాలను అమ్మడం ద్వారా 20 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులను పొందింది. టాటా గ్రూప్ త్వరలో లాంఛ్ చేయనున్న కొత్త డిజిటల్ ప్లాట్‌‌ఫామ్‌‌లో వాటాలను విక్రయించేందుకు పలువురు పొటెన్షియల్ ఇన్వెస్టర్లతో  టాటా గ్రూప్ చర్చలు జరుపుతోందని బ్లూమ్‌‌బర్గ్ కూడా రిపోర్ట్ చేసింది. కన్జూమర్ వ్యాపారాలను మోడ్రనైజ్ చేసేందుకు టాటా గ్రూప్ చూస్తున్నట్టు పేర్కొంది. టాటా గ్రూప్ ఈ కొత్త సంస్థను క్రియేట్ చేసేందుకు, తమ గ్రూప్ వ్యాపారాల్లోఉన్న డిజిటల్ అసెట్స్ అన్నింటిన్ని కలపాలని చూస్తోంది.  వాటాల అమ్మకం, సూపర్ యాప్ లాంఛ్‌‌పై టాటా సన్స్ అధికార ప్రతినిధులు స్పందించేందుకు నిరాకరించారు.

టాటా కొత్త డిజిటల్ ప్లాట్‌‌ఫామ్‌‌ బెవరేజస్ నుంచి జ్యూయల్లరీ, రిసార్ట్స్ వరకున్న ప్రొడక్ట్‌‌లు, సర్వీసులకు ఈ–కామర్స్ గేట్‌‌వేగా ఉండనుంది. టాటాలకు కన్జూమర్ బిజినెస్‌‌ల కింద వాచ్‌‌ బ్రాండ్ టైటాన్, ఫ్యాషన్ రిటైల్ చెయిన్ ట్రెంట్‌‌, తనిష్క్ జ్యూయల్లరీ స్టోర్స్, స్టార్ బజార్ సూపర్ మార్కెట్స్, స్టార్ బక్స్ కాఫీ షాపు​లు, తాజ్ హోటల్స్  వంటివి ఉన్నాయి. రిటైల్ స్పేస్‌‌లో ఉన్న ఈ వ్యాపారాలు, ప్రొడక్ట్‌‌లన్నింటినీ ఒకే ఛానల్ కిందకు తీసుకురావాలని టాటాలు ప్లాన్ చేస్తున్నారు.   ఈ డిజిటల్ ప్లాట్‌‌ఫామ్‌‌తో ముకేశ్ అంబానీ డిజిటల్ వ్యాపారాలు, అమెజాన్ డాట్ కామ్‌‌లతో పోటీ పడాలని చూస్తున్నారు.  టాటాల కొత్త డిజిటల్ ప్లాట్‌‌ఫామ్‌‌ సూపర్ యాప్‌‌లో వాల్‌‌మార్ట్ ఇన్వెస్ట్‌‌మెంట్ 20 బిలియన్ డాలర్ల నుంచి 25 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది.  గ్రూప్‌‌ను డిజిల్‌గా మార్చే డిజిటైజేషన్ చేసే డ్రైవ్‌‌కి, ఆల్ ఇన్ వన్ యాప్‌‌ను అభివృద్ధి చేసే బాధ్యతను టాటా డిజిటల్ హెడ్ ప్రతీక్ పాల్‌‌ను ఇన్‌‌ఛార్జ్‌‌గా టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ నియమించారు. పాల్‌‌కు టీసీఎస్‌‌లో ముఫై ఏళ్ల అనుభవం ఉంది. రిటైల్‌‌కు గ్లోబల్‌‌హెడ్‌‌గా కూడా పనిచేశారు. వాల్‌‌మార్ట్, టెస్కో పీఎల్‌‌సీ, టార్గెట్ కార్ప్, బెస్ట్ బై కో, మార్క్స్ అండ్ స్పెన్సర్ గ్రూప్ పీఎల్‌‌సీ వంటి ప్రపంచంలో కొన్ని అతిపెద్ద రిటైల్ చెయిన్ల డిజిటల్ ట్రాన్స్‌‌ఫర్మేషన్‌‌లో ఆయన సాయం చేశారు.

అప్పులు తగ్గించుకోవచ్చు…

ఈ వార్తలతో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ షేర్లు, టాటా మోటార్స్ షేర్లు, టాటా స్టీల్ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌‌లో 1 శాతానికి పైగా లాభపడ్డాయి. టీసీఎస్ నిఫ్టీ50 ఇండెక్స్‌‌లో బాగా లాభపడింది. ఈ ప్రతిపాదిత డీల్‌‌కు గోల్డ్‌‌మ్యాన్ శాచ్స్ ను బ్యాంకర్‌‌‌‌గా వాల్‌‌మార్ట్ నియమించింది. టాటాల డిజిటల్ ప్లాట్‌‌ఫామ్‌‌లోకి బయట నుంచి ఇన్వెస్టర్లను తీసుకురావడం ద్వారా.. గ్రూప్ డెట్‌‌ను కూడా తగ్గించుకునేందుకు సాయం చేయనుంది. కరోనా వైరస్‌‌తో తన ఫ్లాగ్‌‌షిప్ వ్యాపారాలు కాస్త కష్టపరిస్థితులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. టాటా స్టీల్ లిమిటెడ్ నెట్ డెట్ జూన్ 30 నాటికి 14 బిలియన్ డాలర్లుగా ఉంది. అలాగే టాటా మోటార్స్ నెట్ డెట్ 6.5 బిలియన్ డాలర్లుగా నమోదైంది.

టాటా సూపర్ యాప్ అంటే..

టాటాలకు బెవరేజస్ నుంచి జ్యూయల్లరీ, రిసార్ట్స్ వరకూ చాలా రిటైల్ సర్వీసులు, ప్రొడక్ట్‌‌లు ఉన్నాయి. వీటికి ఈ–కామర్స్ గేట్‌‌వేగా సూపర్ యాప్ ఉండనుంది. టాటాలకు కన్జూమర్ బిజినెస్‌‌ల కింద వాచ్‌‌ బ్రాండ్ టైటాన్, ఫ్యాషన్ రిటైల్ చెయిన్ ట్రెంట్‌‌, తనిష్క్ జ్యూయల్లరీ స్టోర్స్, స్టార్ బజార్ సూపర్ మార్కెట్స్,  తాజ్ హోటల్స్ చెయిన్స్, స్టార్ బక్స్‌‌ కాఫీ షాపులు ఉన్నాయి. యాప్‌‌లో ఫుడ్, గ్రోసరీ నుంచి ఫ్యాషన్, లైఫ్ స్టయిల్, ఎలక్ట్రానిక్స్, ఇన్సూరెన్స్, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఎడ్యుకేషన్, హెల్త్‌‌కేర్, బిల్లు పేమెంట్స్ వరకు సర్వీసులను టాటాలు ఆఫర్ చేయనున్నారు.