ఏసీబీకి చిక్కిన ట్యాక్స్ ఆఫీసర్.. జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం లంచం డిమాండ్

ఏసీబీకి చిక్కిన ట్యాక్స్ ఆఫీసర్.. జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం లంచం డిమాండ్

బషీర్​బాగ్​, వెలుగు: ఓ కంపెనీ ప్రతినిధి వద్ద లంచం డిమాండ్​ చేసిన ట్యాక్స్​ అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని గగన్ విహార్ కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో హైదరాబాద్ సిటీ రేంజ్ –1 ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో ఈ రైడ్ నిర్వహించారు. మాదాపూర్ సర్కిల్ కు చెందిన డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ ఎం.సుధ ఓ కంపెనీ జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం రూ.8 వేలు డిమాండ్​ చేశారు. దీంతో సదరు కంపెనీ ప్రతినిధులు ఏసీబీని ఆశ్రయించారు. మంగళవారం నాంపల్లిలోని కార్యాలయంలో ఆమెకు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌‌‌‌ హ్యాండెడ్‌‌‌‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌‌‌‌కు 
తరలించారు.