అమరావతిలో వైసీపీ నేతలను అడ్డుకున్న టీడీపీ : కార్లపై రాళ్లు, కోడి గుడ్లతో దాడి

అమరావతిలో వైసీపీ నేతలను అడ్డుకున్న టీడీపీ : కార్లపై రాళ్లు, కోడి గుడ్లతో దాడి

ఏపీ రాజధాని అమరావతిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శనివారం ( జూన్ 27 ) ఉండవల్లి గ్రామంలో పర్యటించేందుకు వెళ్లిన వైసీపీ నేతలను అడ్డుకొని కోడిగుడ్లు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు టీడీపీ శ్రేణులు. వైసీపీ నేతలపై వాహనాలపై రాళ్లతో దాడి చేయడంతో పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఈ దాడిలో పోలీసులకు కూడా గాయాలయ్యాయి.

బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా కొన్నిరోజులుగా ఉద్యమిస్తున్నారు పెనుమాక రైతులు. రైతుల ఆహ్వానం మేరకు ఇవాళ వైసీపీ బృందం, రైతు పరిరక్షణ కమిటీ పర్యటనకు వెళ్లగా ఈ ఘటన చోటు చేసుకుంది. భూములు ఇవ్వకపోవడంపై తమపై వేధింపులకు దిగుతున్నారంటున్న పెనుమాక రైతులు ఆరోపిస్తున్నారు.తమ భూములు చుట్టూ మట్టి తవ్వేసి, వ్యవసాయం చేయనివ్వడంలేదని అంటున్నారు రైతులు.

ALSO READ : సాయికృష్ణ కేసులో కీలక పరిణామం..

ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తోంది వైసీపీ. కూటమి ప్రభుత్వం బలవంతపు భూసేకరణకు పాల్పడటమే కాకుండా... రైతుల పక్షాన నిలబడ్డ తమపై దాడికి దిగడం అన్యాయమని అంటున్నారు వైసీపీ నేతలు.