అచ్చెన్నాయుడు స్వగ్రామంలో టీడీపీ అభ్యర్థి గెలుపు

అచ్చెన్నాయుడు స్వగ్రామంలో టీడీపీ అభ్యర్థి గెలుపు

శ్రీకాకుళం: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిమ్మాడ సర్పంచ్ స్థానానికి టీడీపీ బలపర్చిన అభ్యర్థి కింజరాపు సురేష్ గెలుపొందారు. అధికార వైసీపీ పార్టీ తరపున పోటీ చేసిన సమీప బంధువు అప్పన్నపై 1700 ఓట్ల మెజార్టీతో సురేష్ విజయం సాధించారు. వైసీపీ మద్దతుదారుడైన అప్పన్నకు కేవలం 157 ఓట్లు మాత్రమే దక్కాయి. తనను అచ్చెన్న ఫోన్లో బెదిరించాడన్న ఫిర్యాదుతో టీడీపీ ఏపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అరెస్టు చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఎన్నికల పోలింగ్.. ఫలితాల విడుదల సందర్భంగా ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. ఎన్నికల ఫలితం వెల్లడయ్యాక నిమ్మాడ సర్పంచ్ గా గెలిచిన కింజరాపు సురేష్ మాట్లాడుతూ తమ కుటుంబంపై నిమ్మాడ ప్రజలు మరింత బాధ్యతను పెంచారన్నారు. ‘‘స్వర్గీయ ఎర్రన్న ఆశీస్సులు.. అచ్చెన్న.. రామ్మోహన్ నాయుడు.. ఆత్మీయుల సహకారంతో ప్రజా సమస్యలను పరిష్కరిస్తాను.. నిమ్మాడ పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలీసులు కనివినీ ఎరుగని రీతిలో భయబ్రాంతులకు గురిచేశారు..  కింజరాపు కుటుంబం మొత్తాన్ని జైలులో పెట్టి ఇబ్బంది పెట్టారు.. అయినా ప్రజలు ఎవరూ భయపడలేదు.. రెట్టించిన ఉత్సాహంతో టీడీపీని గెలిపించుకున్నారని పేర్కొన్నారు. నిమ్మాడ ఎన్నిక  వైసీపీకి  చెంపపెట్టు.’’ అని సురేష్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

షర్మిల..జగన్ అన్న వదిలిన బాణం కాదు,కేసీఆర్ వదిలిన బాణం

తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తా

కేసీఆర్ అండతోనే షర్మిల కొత్త పార్టీ

జగన్ వద్దన్నా షర్మిల వినలే.. ఆమె పార్టీతో వైసీపీకి సంబంధం లేదు