ఏ..ఒక్క పోలీసును వదలను : చంద్రబాబు

ఏ..ఒక్క పోలీసును  వదలను : చంద్రబాబు

కుప్పం పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు పోలీసుల తీరుపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడిపల్లిలో బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం పై చంద్రబాబు మండిపడ్డారు. అధికార, ప్రతిపక్షాలను పోలీసులు సమానంగా చూడాలన్నారు. సీఎం జగన్ చేస్తున్న ఉన్మాది చర్యలను పోలీసులు ప్రోత్సహిస్తున్నారని ఆయన అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారంతా దోషులేనని చెప్పారు. తాను చేస్తున్న ప్రతిది ప్రజల కోసమే అని.. ప్రజాహితం కోసం తాను పోరాటం చేస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలో సైకో పాలన పోయి సైకిల్ పాలన రావాలని చంద్రబాబు నినాదాలు చేశారు. ఒక సభను అడ్డుకోవడానికి 500 మంది పోలీసులు అవసరమా అని ప్రశ్నించారు. తమ కార్యకర్తలపై కేసులు పెట్టిన ఏ ఒక్క పోలీసును తాను వదలనని హెచ్చరించారు.

సీఎం జగన్ రాజమండ్రిలో మీటింగ్ పెట్టినప్పుడు... రోడ్ షో నిర్వహించినప్పుడు పోలీసులకు నిబంధనలు గుర్తుకు రాలేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. అధికార పార్టీకి చెందిన మంత్రులు సభలు పెట్టినప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. గుడిపల్లి మండలంలో యూనివర్సిటీ తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని చంద్రబాబు చెప్పారు.