తారకరత్నహెల్త్పై కీలక అప్డేట్

తారకరత్నహెల్త్పై కీలక అప్డేట్

బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో  గత  వారం రోజులుగా తారకరత్నకు  చికిత్స కొనసాగుతోంది. అప్పటి నుంచి ఆయన వెంటిలేటర్ పైనే  ఉన్నారు. ఇవాళ టీడీపీ నేత అంబికా లక్ష్మీనారాయణ తారకరత్న ఆరోగ్యంపై కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇవాళ తారకరత్న మెదడును స్కానింగ్ తీశారని చెప్పారు. వచ్చే రిపోర్ట్  ఆధారంగా మెదడు పనితీరు తెలుస్తుందన్నారు. తర్వాతి పరిస్థితిని బట్టి తారకరత్నను విదేశాలకు తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారని చెప్పారు. తారకరత్నను బాలకృష్ణ దగ్గరుండి చూసుకుంటున్నారని తెలిపారు.  

జనవరి 27న చిత్తూరులోని కుప్పంలో నారా లోకేష్ యువగళం పాదయాత్రలో తారకరత్న సొమ్మసిల్లి పడిపోవడంతో బెంగళూరుకు  తరలించారు. అప్పటి నుంచి  ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.