ఏం పీక్కుంటారో పీక్కోండి: పోలీసులపై మాజీ మంత్రి అనుచిత వ్యాఖ్యలు

ఏం పీక్కుంటారో పీక్కోండి: పోలీసులపై మాజీ మంత్రి అనుచిత వ్యాఖ్యలు

నర్సీపట్నం: ఓ కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్న కొద్దిసేపటికే మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు పోలీసులపై, సీఎం జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ పోలీసులపై మండిపడ్డ ఆయన.. తనకు పోలీసులు, పోలీస్ స్టేషన్ కొత్త కాదని చెప్పారు. ఏం పీక్కుంటారో పీక్కోండని, కావాలంటే నాలుగేళ్లు లోపల పెట్టుకోండని అన్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, వారిని దూషించారని గత నెల రెండో వారంలో ఆయనపై కేసు నమోదైంది. దీనిపై పోలీసులు అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఇవాళ మంజూరైంది. బెయిల్ వచ్చిన తర్వాత నర్సీపట్నంలో తన అనుచరులతో కలిసి అయ్యన్న భారీ ర్యాలీ నిర్వహించారు. అబీద్ సెంటర్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి, ఆ తర్వాత మాట్లాడారు. తెలుగుదేశం నాయకులుపై పోలీసులు అక్రమ చేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారాయన. నర్సీపట్నంలో గంజాయి స్మగ్లింగ్ చేస్తోంది వైసీపీ కార్యకర్తలేనని, ఈ విషయం పోలీసులకు తెలిసీనా.. వారినేమీ చేయడం లేదని ఆరోపించారు. వైసీపీ నేతల నుంచి లంచాలు తీసుకుని వారికి ముసుగులేసి మీడియాకు చూపించారన్నారు.

మళ్లీ కేసు పెడతారని తెలుసు

సంక్రాంతికి గోదావరి జిల్లాల్లో కోడి పందాలకు పర్మిషన్ ఇస్తున్నారని, అలా విశాఖ జిల్లాలో ఎందుకు ఇవ్వరో చెప్పాలన్నారు అయ్యన్నపాత్రుడు. ఆ జిల్లాల్లో కోడి పందేలు జరిగితే, విశాఖలోనూ పందేలు వేయాల్సిందేనని అన్నారు. పోలీసులు పర్మిషన్ ఇచ్చిన ఇవ్వకపోయిన తాను దగ్గరుండి జరిపిస్తానని, పోలీసులు ఏం చేసుకుంటారో చేసుకోండి అని సవాల్ విసిరారు. తన మాటలకు మళ్లీ కేసు పెడతారని తెలుసని, కావాలంటే పెట్టుకోవచ్చని తనకేం భయం లేదని అన్నారు. రాష్ట్రంలో ఏ డిపార్ట్‌మెంట్ పని చేయడంలేదని, ఒక్క పోలీస్ డిపార్ట్ మెంట్ మాత్రమే పని చేస్తోందన్నారు మాజీ మంత్రి అయ్యన్న. ఈ పోలీసులతో జాగ్రత్తగా ఉండాలని తన అనుచరులకు సూచించారు. ఎక్కడైనా పోలీసులు లాఠీతో కొడతారని, కానీ అమరావతిలో నిరసన చేస్తున్న మహిళల్ని కొరుకుతున్నారని ఆరోపించారాయన. ఇదేం పని రా అంటూ అయ్యన్నపాత్రుడు ఫైర్ అయ్యారు.

More News:

మోడీని కలిసిన మంచు ఫ్యామిలీ.. బీజేపీ లోకి ఎంట్రీ?

ఏ ఒక్క ఓటూ మిస్ అవ్వొద్దు.. సామాన్యుడికీ పోస్టల్ బ్యాలెట్

పిచ్చోడి పాలన

సీఎం జగన్మోహన్ రెడ్డిపైనా టీడీపీ సీనియర్ నేత అయ్యన్న తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏడు నెలలుగా పిచ్చొడి పాలన నడుస్తోందని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మూడు రాజధానులని ప్రకటించాడమేంటని ఫైర్ అయ్యారు. ఎన్నికల మేనిఫెస్టోని సీఎం పూర్తిగా మర్చిపోయారని అన్నారు. రాష్ట్రంలో పోలీసు పాలన నడిపిస్తూ.. ఎదురు తిరిగి ప్రశ్నిస్తే జైలులో పెట్టిస్తున్నారన్నారు. పోలీసులు ప్రవర్తిస్తున్న తీరుకు దురుసుగా కాకుంటే ఎలా మాట్లాడాలని ప్రశ్నించారాయన.