జగన్ ఓడిపోయాడు కానీ... చావలేదు.. అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు

జగన్ ఓడిపోయాడు కానీ... చావలేదు.. అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు

ఏపీలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం పరిపాలనపై దృష్టి పెట్టింది. ఏపీకి 4వసారి సీఎంగా పగ్గాలు చేపట్టిన చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తొలిరోజునే 5ఫైళ్లపై సంతకాలు చేసి తన మార్క్ పాలన ప్రారంభించాడు. ఇదిలా ఉండగా వైసీపీ శ్రేణులపై టీడీపీ శ్రేణులు కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఎన్నికల ఫలితాల రోజు నుండే మొదలైన దాడులు పలు చోట్ల ఉద్రిక్తతకు దారి తీశాయి. ఈ అల్లర్లపై వైసీపీ నేతలు గవర్నర్ కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు జగన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

జగన్ ఓడిపోయాడు కానీ చావలేదంటూ అయ్యన్న చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీసాయి.జగన్ కు అపారమైన ధనబలం, కుల బలం ఉందని, తెలంగాణ ప్రభిఉత్వంలో కూడా జగన్ మనుషులు ఉంటారని పక్కన ఉన్న వ్యక్తి అన్నారు. ఈ దేశంలో డబ్బుకు లొంగిపోనివాడు లేడంటూ ఆ వ్యక్తి అన్నారు, జగన్ ను ఈసారి లేవకుండా కొట్టాలని అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యల పట్ల వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.