
కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య వెరైటీ నిరసన చేపట్టారు. ఇసుక కొరత తీర్చాలంటూ గాడిదపై ఊరేగుతూ నినాదాలిచ్చిన బంగి అనంతయ్య..తాజాగా కలెక్టరేట్ గాంధీ విగ్రహం వద్ద గుండు కొట్టించుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బంగి మాట్లాడుతూ సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు ఉచితంగా ఇసుక ఇచ్చాడని, జగన్ ఇసుక కోసం చుక్కలు చూపిస్తున్నాడని అన్నారు. గాలి.. నీరు.. ఇసుక దేవుడిచ్చినవి, ఇసుక రీచుల్లో గుట్టలు.. గుట్టలుగా ఉందన్నారు. ప్రజలకు ఉచితంగా ఎందుకు ఇవ్వడం లేదన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు… నాయకులు అమ్ముకోవడం కోసమా అంటూ..? ప్రశ్నించారు. జగన్ ఒక్కో ఇసుక ట్రాక్టర్ 5 వేలు.. 10 వేలు , బ్లాక్ లో 30 వేలు.. 40 వేలు అంటున్నారని అన్నారు. నేను పర్ ఫెక్ట్ గా పనిచేస్తున్నా అంటున్న జగన్.. వెనుక నుండి ఇలా గోతులు తవ్వడం ఏం పద్ధతి అని అడిగారు. చంద్రబాబు హయాంలో తెలంగాణ వారు ఏపీకి వలస వచ్చి బతికేవారన్న బంగి.. ఇప్పుడు ఇసుక లేక ఏపీ వాళ్లు తెలంగాణకు వలసపోవాల్సి వస్తోందని చెప్పారు. ఇసుక లేకపోవడం వల్ల ప్రజలు కష్టాలు పడుతున్నారని వ్యాఖ్యానించారు. నా కొడుకు వయసున్న జగన్ సీఎం కావడం ఆయన అదృష్టంమని, ఇసుక ఉచితంగా ఫ్రీగా ఇచ్చి.. తెలంగాణకు వలస పోకుండా జగన్ పేదలను కాపాడాలని బంగి అనంతయ్య కోరారు.