
ఏపీ సీఎం జగన్ పై నారా లోకేశ్ వ్యాఖ్యలు
పెనం మీద దోశ తిప్పినంత ఈజీగా సీఎం జగన్ మాట మార్చారన్నారు టీడీపీ నేత నారా లోకేశ్. సామాజికంగా వెనుకబడిన మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తానన్న జగన్ హామీలపై ట్విటర్ లో స్పందిస్తూ.. 46 ఏళ్లకి ముఖ్యమంత్రి ఉద్యోగం రాగానే, 45 ఏళ్ల పెన్షన్ రత్నం మాయమయ్యిందన్నారు. పాదయాత్రలో గుర్తొచ్చిన ప్రజల కాళ్ల నొప్పులు జగన్ కుర్చీ ఎక్కగానే మర్చిపోయారా? అంటూ ఎద్దేవా చేశారు.
జగన్ గారు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ రూపంలో ఒక్కో మహిళకు లక్షా ఇరవై వేల రూపాయిలు ఇవ్వాలని, కాని జగన్ గారు మడమ తిప్పడం, మాట మార్చడం ద్వారా ఒక్కో బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళకి రూ.45 వేల నష్టం కలుగుతోందన్నారు. మాట మార్చిన సీఎం ఆ మహిళలను మోసం చేశారని లోకేశ్ ట్వీట్స్ చేశారు.
46 ఏళ్లకి @ysjaganగారికి ఉద్యోగం వచ్చింది. 45 ఏళ్ల పెన్షన్ రత్నం మాయమయ్యింది. పాదయాత్రలో గుర్తొచ్చిన ప్రజల కాళ్ల నొప్పులు మీరు కుర్చీ ఎక్కగానే మర్చిపోయారా? బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ అన్న మీరు ఇప్పుడు పెనం మీద దోశ తిప్పినంత ఈజీగా మాట మార్చి వారిని మోసం చేసారు. pic.twitter.com/jTW9jx9FNV
— Lokesh Nara (@naralokesh) July 23, 2019