నిజంగా అద్భుతం : boy అక్షరాలను నిమిషంలో బొమ్మగా మార్చేశాడు..

నిజంగా అద్భుతం : boy అక్షరాలను నిమిషంలో బొమ్మగా మార్చేశాడు..

చిత్రకళ.. ఇది సహస్రాబ్దాలుగా మానవ కమ్యూనికేషన్లలో అంతర్భగమైన కళ. ప్రారంభంలో గుహచిత్రాల నుంచి నేటి క్లిష్టమైన డిజిటల్ డిజైన్ల వరకు సమాచారాన్ని తెలియజేయడానికి, భావోద్వేగాను ప్రేరేపించడానికి, ఊహలు రేకెత్తించేందుకు శక్తివంతమైన సాధనాలుగా మారాయి. క్రీ.పూ. 15000 నాటిది ఈ కళ. మానవుల ఆలోచన లను చిత్రాల రూపంలో వ్యక్తీకరించాలనే మానవ కోరికకు ఇది ఒక రూపం. డ్రాయింగ్ లు, పెయింటింగ్ లు , ఫొటోగ్రాఫ్, డిజిటల్ రెండరింగ్ ద్వారా వివరించడంలో ఇల్లస్ట్రేషన్ సారాంశం స్థిరంగా ఉంటుంది. 

ఇదంతా  ఎందుకు వివరించామంటే.. ఇటీవల సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ లలో వైరల్ అయిన వీడియోలో ఇల్లస్ట్రేషన్ మ్యాజిక్ అందంగా చిత్రీకరించాడు ఓ ఉపాధ్యాయుడు. x లో భాగస్వామ్యం చేసిన ఈ వీడియోలో ఓ టీచర్ తన అధ్భుతమైన నైపుణ్యంతో గీసిన చిత్రాలను చూపించారు. ఒక సాధారణ సుద్ద డ్రాయింగ్ తో ఒక యువకుడి ముఖాన్ని చాలా క్లారిటీగా చిత్రీకరించాడు. 

బ్లాక్ బోర్డుపై కేవలం BOY అనే పదాన్ని రాసి దాని అద్బతమైన చిత్రంగా క్షణాల్లో మార్చేశాడు. ఓ యువకుడి రూపు రేఖలను ఈజీగా ఆ పదం నుంచి గీశాడు. కేవలం 32 సెకన్లతో ఈ చిత్రాన్ని గీశాడు. ఇది నెటిజన్లను బాగా ఆకట్టుకుంది.  నాలుగు మిలియన్లకు పైగా వ్యూవర్స్ చూశారు. టీచర్ చిత్రకళా నైపుణ్యానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. అతని ఆ చిత్రానికి జీవం పోశాడని తెగ మెచ్చుకుంటున్నారు. కొందరైతే ఈ వీడియోన తమ పిల్లలకు చూపించి .. ఆ టీచర్ ప్రతిభ గురించి చెప్పుకున్నారట. ఆ టీచర్ గీసిన బొమ్మ.. అచ్చు ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్ పోలి ఉందని కొందరు వ్యాఖ్యానించారు. 

మొత్తం మీద ఆ ఉపాధ్యాయుడిని కళాకారుడిగా, టీచర్ గా డ్యూయెల్ రోల్ అద్భతంగా ఉందని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.